అరవింద సమేతకు అతనొక పిల్లర్: ఎన్టీఆర్

0

అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర హీరోగా నటించడమే కాదు ఎవ్వరైనా మంచి క్యారక్టర్లు ఆఫర్ చేస్తే కాదనకుండా యాక్సెప్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నాని సినిమా ‘నేను లోకల్’ లో నవీన్ పాత్ర చాలామందిని మెప్పించింది. రీసెంట్ గా ‘దేవదాస్’ లో కూడా నవీన్ నెగటివ్ రోల్ పోషించాడు. ఇక దసరాకు రిలీజ్ కానున్న ‘అరవింద సమేత’ లో ఒక విలన్ గా నటించాడు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదుగానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత ప్రశంసలు అందుకున్నాడు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నవీన్ చంద్ర గురించి ప్రస్తావించాడు. నవీన్ చంద్ర ‘అరవింద సమేత’ కు ఉన్న ముఖ్యమైన పిల్లర్స్ లో ఒకరు అని చెప్పాడు. “నేను ‘అందాల రాక్షసి’ చూసినప్పుడే నవీన్ తో కనెక్ట్ అయ్యాను. ‘అరవింద సమేత’ తర్వాత గొప్పనటులలో నవీన్ ఒకరని అర్థం అయింది” అన్నాడు. నవీన్ యువ నటుడు అయినప్పటికీ ఎన్టీఆర్ తన స్పీచ్ లో అతని పేరు ప్రస్తావించి మరీ ప్రశంసించడం అందరినీ ఆకట్టుకుంది.

తెలుగులో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో యంగ్ టైగర్ ఒకరు. మరి అలాంటి నటుడి చేత పబ్లిక్ ప్లాట్ ఫామ్లో అప్రీసియేషన్ అందుకోవడం నవీన్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చేదే. మరి ‘అరవింద సమేత’ లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించి ఉంటాడేమో. ఎన్టీఆర్ – జగపతి బాబు లాంటి నటుల మధ్య తన ఐడెంటిటీ నిలుపుకుని సత్తా చాటడం మామూలు విషయం కాదు. మరి నవీన్ కు ఎలాంటి పాత్ర దక్కిందో చూడాలంటే అక్టోబర్ 11 వరకూ వేచి చూడాలి.
Please Read Disclaimer