నోటీసులపై స్పందించిన ఎన్టీఆర్

0ntr-interviewనాన్నకు ప్రేమతో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు అందుకున్న ఎన్టీఆర్ వాటిపై స్పందించారు. తమ సినిమా పూర్తిగా లండన్ లో నిర్మించామని, లండన్ లో తీసిన సినిమాకు భారత్ లో టాక్స్ వర్తించదన్నారు. ఇప్పటికే కాగ్ నోటీసులకుతన ఆడిటర్ రిప్లై ఇచ్చినట్టుగా తెలిపారు.

ఆదాయపు పన్నుతో పాటు సర్వీన్ టాక్స్ ను కూడా క్రమం తప్పకుండాచెల్లిస్తున్నాని తెలిపిన ఎన్టీఆర్, భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఎప్పుడూ మరవలేదన్నారు. చెల్లించాల్సిన పన్ను ఏదైనా ఉన్నట్టుగా తేలితే అణా పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగ్ సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి ఎన్టీఆర్ 1.10 కోట్ల టాక్స్ మినహాయింపు పొందారని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.