వీడియో: ఎన్టీఆర్ హౌస్‌లో కెమెరాలు..

0ntr-s-bigg-boss-2nd-promoయంగ్ టైటర్ ఎన్టీఆర్ త్వరలో ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ షో స్టార్ మాటీవీలో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.

ఇటీవల ‘బిగ్ బాస్’ షోకు సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఎన్టీఆర్ నిద్రలేవగానే చుట్టూ కెమెరాలు చూసి షాకవ్వడం…. నేను కెమెరాలు పెట్టమంది నా హౌస్‌లో కాదు, బిగ్ బాస్ హౌస్‌లో అని ఎన్టీఆర్ చెబుతూ…ఈ ప్రోమో సాగుతుంది.

ఈ రియాల్టీ షోలో మొత్తం 12 మంది పోటీ దారులు ఉంటారు. వీరందరినీ ప్రత్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి పంపించి తాళం వేస్తారు. వారి కదలికలను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. హిందీ బిగ్ బాస్ లో సామాన్యులు, సెలబ్రిటీలు కలిసి పాల్గొనే వారు. తెలుగులో ఇదే మొదటి సీజన్ కాబట్టి ప్రస్తుతానికి సామాన్యులకు అవకాశం లేదు. కేవలం సెలబ్రిటీలతోనే తొలి సీజన్ నిర్వహించబోతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో భిన్నమైన వాతావరణం ఉంటుంది. అందులో వాళ్లు బ్రతకడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ సెల్‌ఫోన్ లు, టీవీలు, దినపత్రికలు వంటివి కూడా వారికి అందుబాటులో ఉండవు. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు ఉండవు.

ఒక భిన్నమైన పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‍‌లో గడుపుతున్న వారి…. భావోద్వేగాలు, ప్రవర్తన ఎలా ఉంటాయో గమనించడమే ప్రేక్షకులకు ఎంటర్టెన్మెంట్. విభిన్న రంగాలకు చెందిన, భిన్నమైన అభిరుచులు కలిగిన పలువురు సెలబ్రిటీలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే చోట ఎలా ఉంటారన్నదే ఈ షోలో ఆసక్తికరం.