తారక్ చుట్టూ థగ్స్!

0

అవును తారక్ ని రౌండప్ చేశారు. రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేశారు. ఇంతకీ కన్ ఫ్యూజ్ చేసిన ఆ థగ్స్ ఎవరు? చేసిందెవరో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు. షాక్ తిని గిలగిలా కొట్టుకుంటారు. రంగుల ప్రపంచంలో ఎన్నో సీక్రెట్స్ ని గుట్టు చప్పుడు కాకుండా లీక్ చేసే థగ్స్ వీళ్లంతా. అంతేకాదు.. తమదైన ప్రతిభా పాఠవంతో రంగుల ప్రపంచాన్ని ఫోటోల రూపంలో ప్రపంచానికి ఆవిష్కరించే గ్రేట్ ట్యాలెంట్ కూడా వీళ్లు. ఇందులో బ్రెయిన్ విత్ ఫోటోగ్రఫీ ట్యాలెంటు చాలామంది ఉన్నారు. ఒక స్టార్ ని ఏవిధంగా చూపిస్తే అందంగా కనిపిస్తారు? ఒక అందమైన కథానాయికను ఇంకా అందంగా చూపించడమెలా? అసలు ప్లాస్టిక్ ముఖాల్ని సైతం ముద్దొచ్చే లా చూపెట్టేదెలా? ఇలాంటి అరుదైన ఫోటోగ్రఫీ సైన్స్ లో ఆరితేరిపోయిన ఘనాపాటీలు వీళ్లంతా. టాప్ యాంగిల్లో టాప్ లేపేస్తావా? లో యాంగిల్ లో లోనెక్ చూపిస్తావా..? మాకు తెలీకుండా ప్యాంటీపై ఫోకస్ చేస్తావా? తప్పు తప్పు! అని తిట్టేసే భామామణులకు తెలియాల్సినవి ఎన్నో ఉంటాయిక్కడ!! అయినా కథానాయికల్ని వన్నెచిన్నెల వయ్యారి భామలుగా చూపించకపోతే అసలు యూత్కి కిక్కెక్కేది ఎలా? కోట్లకు కోట్లు పారితోషికంగా ఎలా దోచి పెడతారు? కానీ ఆ కిక్కు తేవడంలో వీళ్ల సత్తానే పని చేసేది.

సిటీలో మోస్ట్ వాంటెడ్ .. మోస్ట్ ట్యాలెంటెడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ వీళ్లంతా.. 100మంది పైగా అసోసియేషన్ సభ్యులున్న విజువల్ మిరాకిల్ ఫోటోగ్రఫీ స్టార్లు వీళ్లంతా. నెలకు లక్ష పైగా ఆర్జించే సత్తా ఉన్న ఫోటోగ్రాఫర్ బ్యాచ్ వీళ్లంతా. పరిశ్రమ బావుంటే … ఆరోగ్యకర పరిస్థితి ఉంటే.. అంత దమ్ము వీళ్లు చూపిస్తారు. వీళ్ల ఫోటోల్ని నమ్ముకుని కోట్లాది రూపాయల బిజినెస్ సాగుతుందంటే అతిశయోక్తి కానేకాదు. బిజీ ట్రాఫిక్ కూడళ్లను దాటుకుని మెట్రోల్లో యూటర్నులు తిరుక్కుంటూ ఆదరాబాదరాగా ప్రెస్ మీట్ కి వస్తారు. స్టార్లను అందంగా ఫోటోలు తీస్తారు.

టాలీవుడ్ ని దశాబ్ధాల పాటు తమ ఫోటో జర్నలిజంతో శాసిస్తున్న వీరాధివీరులు.. సూరులు.. కన్నలు.. కథానాయికలకు భంగిమలు నేర్పించే ఫోటోగ్రఫీ డైరెక్టర్లు వీళ్లంతా… బాప్రే..! కెమెరా ఉన్నోళ్లంతా ఫోటో జర్నలిస్టులు కాలేరు.. సినిమా ఫోటో జర్నలిస్టులు అసలే కాలేరు!! అంటారా? అందుకే.. కొన్ని ప్రత్యేక అర్హతలు ఉన్నాయి కాబట్టే వీళ్లంతా స్పెషల్ స్టిల్ ఫోటోగ్రాఫర్లుగా ఈ రంగంలో దశాబ్ధాల పాటు మనగలిగారు. ఇంతకీ నెలకు లక్ష సంపాదించే సినిమా ఫోటోజర్నలిస్టు కావడం ఎలా? వస్తే.. నాలుగు రోజులు ప్రెస్ మీట్ల చుట్టూ తిరిగితే .. మీడియా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అప్పుడు తెలుస్తుంది? అసలు సంగతి!ప్చ్!!!! నేడు తారక్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలా మీడియా జర్నలిస్టులతో టైమ్ స్పెండ్ చేశారు.. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్ ప్రాంగణంలో. అనంతరం ఉల్లాసంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు.
Please Read Disclaimer