సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ సందడి

0యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది. చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ వెయిట్ తగ్గించి స్లిమ్‌గా తయారౌతాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ని పెట్టించుకుని మరీ ఎన్టీఆర్ వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఒకటి దర్శనమివ్వడంతో ఎన్టీఆర్ కొత్త లుక్ చూడాలని అభిమానులు తహతహ లాడుతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా ఫైనల్ చేశారు. ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది