టైటిల్ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ సెంటిమెంట్

0ntrజనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. కొత్త సినిమా పనులు ఇప్పటికే మొదలుపెట్టేశాడు. బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కొత్త సినిమాను తానే నిర్మిస్తున్నట్లు.. కళ్యాణ్ రామ్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించేశాడు. యంగ్ టైగర్ ఈ సినిమాలు మూడు పాత్రలు పోషిస్తున్నాడనే టాక్ ఉంది.

ఈ మూడు పాత్రలు మూడు కోణాల్లో ఉంటాయట. విభిన్నమైన మూడు రోల్స్ లో.. తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు అనువుగా స్క్రిప్ట్ గా ఉండడంతోనే.. ఫ్లాప్ డైరెక్టర్ అయినా బాబీకి సినిమా ఇచ్చాడట ఎన్టీఆర్. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ మూవీకి ‘నట విశ్వరూపం’ అనే టైటిల్ నే అనుకుంటున్నారని తెలుస్తోంది. అభిమానులకు అసలు సమస్య అక్కడే మొదలైంది. టైటిల్ లో గ్రాండ్ నెస్ ఉన్నా.. పవర్ ఫుల్ అయినా.. గతంలో ‘విశ్వరూపం’ పేరుతో సీనియర్ ఎన్టీఆర్ చేసిన మూవీ భారీ ఫ్లాప్ అయింది. దాసరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దారుణమైన పరాజయం ఎదుర్కొంది.

మరోవైపు విశ్వరూపం టైటిల్ పై రీసెంట్ గా కమల్ ఓ సినిమాతో మాంచి సక్సెస్ సాధించాడు. విశ్వరూపం2 కూడా దాదాపు రెడీ అయింది. ఇలాంటి సమయంలో ‘నట విశ్వరూపం’ అనే టైటిల్ పెడితే కమల్ సినిమాతో పోలికలు వస్తాయని.. గతంలో పెద్ద ఎన్టీఆర్ కి అచ్చిరాని టైటిల్ మనకెందుకు అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి జూనియర్ ఎన్టీఆర్-బాబీలు ఏం డిసైడ్ అవుతారో!

loading...