ఎన్టీఆర్ తో గొడవ ఫై వంశీ క్లారిటీ

0స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ ..మొదటిసారి డైరెక్టర్ గా చేసిన నా పేరు సూర్య చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి వంశీ ముందు ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది..ఎన్టీఆర్ సైతం పలు వేదికల ఫై నా నెక్స్ట్ డైరెక్టర్ వంశీనే అని చెప్పాడు. కానీ సడెన్ గా ఏమైందో ఏమో కానీ వంశీ ఎన్టీఆర్ ను పక్కన పెట్టి అల్లు అర్జున్ తో చేసాడు. అయితే వంశీ , ఎన్టీఆర్ ల మధ్య గొడవ జరిగిందని అందుకే చివరి నిమిషం లో అల్లు అర్జున్ తో సినిమా చేసాడనే ప్రచారం జరిగింది.

కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు వంశీ. “నిజానికి ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. నన్ను దర్శకుడిగా మారమని ప్రోత్సహించిన వ్యక్తి తారక్. మేమిద్దరం కలిసి ఓ స్టోరీపై వర్కవుట్ చేశాం. కానీ అది వర్కవుట్ కాలేదు. వేరే ఎప్పుడైనా కలిసి పనిచేద్దామని ఓ మాట అనుకొని మేం విడిపోయాం. అంతే తప్ప మా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాల్లేవు.” అని క్లారిటీ ఇచ్చాడు.