మహిళలతో నగ్న పూజలు, ఇద్దరు అరెస్ట్

0arrestపిల్లలు పుట్టలేదనే కారణంగా నగ్నంగా మహిళలతో పూజలు చేయిస్తున్న ఇద్దరు మంత్రగాళ్ళను అయిదుగురు మహిళలను పోలీసులు

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రానికి చెందిన ఐదురుగు గర్భం దాల్చకపోవడంతో పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించారు. అయితే పూజలు నిర్వహించాలని ఆమె సూచించింది.

ఎస్ఆర్ఎస్‌పి కాలువ వద్దకు బాధితురాళ్ళలను పిలిపించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని నమ్మించారు. బాధిత మహిళలను నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదవిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వర్ధన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంత్రగాళ్ళను అదుపులోకి తీసుకొన్నారు. మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు కూడ ఉన్నాడు.