ఆత్మహత్యే మార్గం అంటున్న ఆఫీసర్ బయర్

0ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అసలు ఫార్మ్ లో లేడు అన్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో చిన్న హీరోలతో అయినా పెద్ద సినిమాలతో అయినా తీసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. అలాంటి వర్మతో కింగ్ నాగార్జున తన సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి అక్కినేని ఫ్యాన్స్ కంగారుగానే ఉన్నారు. అనుకున్నది కాస్త అయింది. సినిమా ప్లాప్ అయింది. పాపం సినిమాను కొనుక్కున్న బయర్ల సంగతి దారుణంగా మారగా అందులో ఒకరు ఆత్మహత్య మాత్రమే తనకున్న దారి అని వాపోయాడు.

ఈమధ్య కాలంలో మార్కెట్ తో సంబంధం లేకుండా ట్రాక్ రికార్డుల ఆధారంగా సినిమాలు కొంటున్నారు. వర్కౌట్ అయితే పండగే. కానీ ప్లాప్ అయితే మాత్రం నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. రాజమండ్రి లో సుబ్రహ్మణ్యం అనే ఒక బయర్ 3.5 కోట్లు వెచ్చించి ఆఫీసర్ సినిమా ను కొనుకున్నాడు. ఆంధ్రాలో 8 జిల్లాలకు కలిపి 3.5 కోట్లు పెట్టి కొన్నాడన్నమాట. నాగార్జున నటించిన రాజు గారి గది సినిమాను కూడా అంత పెట్టె కొనగా సినిమా 7 కోట్లు సంపాదించింది. అందుకే ఇంకేం ఆలోచించకుండా – అర్జీవీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా ఆఫీసర్ సినిమా కోసం కూడా అంత పెద్ద మొత్తాన్ని పెట్టాడు.

దురదృష్టవశాత్తు సినిమా ప్లాప్ అయ్యింది. థియేటర్ లు హౌస్ ఫుల్ అవ్వడం పక్కన పెడితే మౌత్ టాక్ కూడా అంత మంచిగా ఏమి లేదు. ఇన్వెస్టర్ల నుండి వరుస ఫోన్ కాల్స్ వస్తుండడంతో సతమవుతున్న సుబ్రమణ్యం తనకు వర్మ డైరెక్ట్ గా తెలీదు అని సహా నిర్మాత సుధీర్ చంద్ర నుండి సినిమా రైట్స్ కొన్నట్టు తెలిపాడు. ఇలాంటి పెద్ద సినిమాను కొనడం ఇదే మొదటిసారి అని కనుక ఇండస్ట్రీ లో పెద్ద వాళ్లు కొంచెం దయ ఉంచి తనకు సహాయం చేయాలని మొర పెట్టుకుంటున్నాడు. చూద్దాం మరి బయర్ కష్టాలు తీర్చడానికి ఎవరు ముందుకొస్తారో.