దారుణం : మూడు రోజులకే లేపేసారు..

0నాగార్జున కెరియర్లోనే దారుణంగా ఆఫీసర్ సినిమా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడమే కాదు , నాగ్ కెరియర్ లో ఓ చేదు మచ్చ గా నిలిచిపోయింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కోటి రూపాయిలు కూడా సాదించలేదంటే ఈ సినిమా ఎంతో చెత్తగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ మూవీ వల్ల డిస్ట్రబ్యూటర్స్ అంత నష్టాల పాలైయ్యారు. ఇప్పటికే చాలామంది తమకు న్యాయం చేయాలనీ కోరుకుంటున్నారు. మరోపక్క అన్ని థియేటర్స్ వారు ఆఫీసర్ చిత్రాన్ని థియేటర్స్ నుండి లేపేసి , ఆ స్థానం లో విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతవరకు నాగార్జున నటించిన ఏ సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్స్ నుండి లేపేయలేదు. మొదటిసారి ఆఫీసర్ చిత్రం వల్ల ఆ రికార్డ్స్ నాగ్ ఖాతాలో పడింది. ప్రస్తుతం నాగ్ ఈ సినిమాను మరిచిపోయేందుకు కష్టపడుతున్నాడు.