ఆఫీసర్ నిర్మాత ఓపెన్ లెటర్..

0రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఆఫీసర్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వర్మ నమ్మకాన్ని బట్టి ఆ సినిమా ఎంతో కొంత హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. పైగా నాగార్జున లాంటి స్టార్ హీరో చేస్తుండడంతో సినిమాలో మ్యాటర్ ఉంటుందని ఒక క్రేజ్ వచ్చింది. కానీ ఆ సినిమా మొదటి షోకే డిజాస్టర్ అని తేలింది. కనీసం నాగార్జున అభిమానులు కూడా సినిమా పట్ల సంతృప్తి చెందలేకపోయారు.

ఇకపోతే సినిమా సహా నిర్మాతగా వ్యవహరించిన సుదీర్ చంద్ర మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. ప్రస్తుత వస్తున్న రూమర్స్ అలాగే కలెక్షన్స్ టాక్ పట్ల ఆయన ఆ లేఖ ద్వారా స్పందించారు. కొన్ని ఏరియాల్లో సినిమాను బలవనతంగా రిలీజ్ చేయించారని కొంత టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమాను రిలీజ్ చేయించారని అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని సుదీర్ చంద్ర లేఖలో పేర్కొన్నారు. అలాగే సినిమా రిజల్ట్ పట్ల కూడా ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.

సినిమా టెక్నీకల్ పరంగా అలాగే విజువల్ పరంగా అంతగా ఆకట్టుకోలేదు. దాన్ని నేను తప్పుబట్టలేను. దాచలేను. కానీ సినిమా కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక విడుదల విషయంలో అలాగే కలెక్షన్స్ విషయంలో రూమర్స్ రావడం దాన్ని కొన్ని మీడియా వాళ్లు కవర్ చేయడం కరెక్ట్ కాదని లేఖ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఏరియాల్లో సినిమాను మంచి దరకు కొనుగోలు చేసినట్లు చెబుతూ.. నిన్నటి వరకు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు.