ఓ బేబీ అంటున్న పూనమ్ – శక్తి

0

హాట్ బ్యూటీ పూనమ్ పాండే – సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది జర్నీ అఫ్ కర్మ’.. ఇది మన తెలుగు ‘ఖర్మ’ కాదు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు కర్మ. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలలో ఈ సినిమా ఎలాంటి కంటెంట్ ఉంటుందో చూపించారు. దీన్ని బోల్డ్ కంటెంట్ అనాలా లేదా బూతు కంటెంట్ అని పిలవాలో అర్థం కావడం లేదు కానీ ముసలి శక్తి కపూర్ – హాట్ బ్యూటీ పూనమ్ రొమాన్స్ పై ఇప్పటికే నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుండి ‘ఓ బేబీ’ అంటూ సాగే ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. నిశాంత్ సలీల్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ పాటకు లిరిక్స్ అందించింది నిశాంత్.. అమృత తాలుక్దార్. కంప్లీట్ గా ఇంగ్లీష్ లో సాగే ఈ పాటకు సింగర్ అమృత తాలుక్దార్. వీడియో లేకుండా జస్ట్ పాటగా వింటే మాత్రం ఇది ఆకట్టుకునేదే. కానీ పూనమ్ – ముసలి శక్తి కపూర్ ల జోడీని మాత్రం చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. యాజ్ యూజువల్ పూనమ్ పాండే తన అందాలను ధారాళంగా ధారపోసింది. గోవా లోకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించడం మరో విశేషం.

బాలీవుడ్ అంతా #మీటూ రగడ జరుగుతూ ఉంటే ఈ శక్తి కపూర్ మాత్రం తీరిగ్గా కుర్ర పూనమ్ తో ఘాటు రొమాన్స్ చేస్తున్నాడని.. రేపో మాపో శక్తి కపూర్ పేరు #మీటూ లో బయటకు వచ్చినా షాక్ కావొద్దని నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. ఏ సమయానికి ఎవరిపై ఆరోపణలు వస్తాయో మనకు తెలీదు కాబట్టి అంతలోపు ‘ఓ బేబీ’ ని మీరూ చూడండి.
Please Read Disclaimer