మహర్షికి ఈ మసాలా సరిపోతుందా ?

0

ఈ రోజును పక్కబెడితే ఇంకొక్క ఎనిమిది రోజులు అవ్వగానే మహర్షి సునామి మొదలవుతుంది. ఐదు పాటలు అనుకుంటే టీం షాక్ ఇస్తూ ఇవాళ సాయంత్రం మరో ఆడియో సింగల్ ని జ్యూక్ బాక్స్ తో సహా రిలీజ్ చేయబోతోంది. అంటే మొత్తం ఆరు ఆడియో ట్రాక్స్ తో మహర్షి అలరించనున్నాడు. నిన్న వచ్చిన పాల పిట్ట మాస్ ఫాన్స్ కు ఓ మాదిరిగా కనెక్ట్ అయినా ఫైనల్ గా ఇదీ దేవి స్థాయిలో లేదనే కామెంట్స్ నే మూటగట్టుకుంది. సరే ఇవాళ వచ్చేది బ్రహ్మాండంగా ఉందీ అనుకుందాం మొత్తం రెండు పాటలు మాత్రమే పాస్ అయినట్టు లెక్క కట్టొచ్చు.

అభిమానులు మాత్రం వీటిని రేపు తెరమీద చూసాక అందరూ అభిప్రాయం మార్చుకుంటారనే ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా మహర్షికి సాధారణంగా మహేష్ మూవీ అంటే కనిపించే హై ప్రొఫైల్ హైప్ ఎందుకో తగ్గిన ఫీలింగ్ కలుగుతోంది .ఒకవేళ టీజర్ తో పాటు ఆడియో కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే లెక్క వేరుగా ఉండేదేమో కాని ఇప్పుడీ లోటుని తీర్చాల్సింది రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లస్ అందులో విడుదలయ్యే ట్రైలర్ మీదే ఉంది.

ఇప్పటికే మహేష్ ఫాన్స్ సంబరాలకు రెడీ అవుతున్నారు. మహేష్ 25వ సినిమా కాబట్టి మర్చిపోలేని స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నారు. అయితే పంటి కింద రాయిలాగా ఆల్బం మీద వచ్చిన ఫీడ్ బ్యాకే వాళ్ళను చికాకు పెడుతోంది. ఇదిలా ఉండగా ట్రైలర్ మీద మాత్రం ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. రికార్డుల మోత దీంతోనే మొదలవుతుందని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో అడ్వాన్సు బుకింగ్స్ మొదలవుతున్నాయి. టికెట్ రేట్ల హైక్ గురించి ఇంకా స్పష్టత రాని నేపధ్యంలో అది ఖరారయ్యాక జాతర మొదలవుతుంది
Please Read Disclaimer