భారత మహిళ జట్టుకి ఎన్టీఆర్ ట్వీట్!

0Ntr-mithai-rajప్రపంచకప్‌ని తృటిలో చేజార్చుకున్న భారత మహిళా జట్టుకి దేశంలోని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలుపుతున్నారు. లార్డ్స్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 2005 తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత్ ఒకానొక దశలో అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. చివర్లో ఒత్తిడికి తలొగ్గి వరుసగా వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది.

‘గెలిచామా.. ఓడామా అనేది ఇక్కడ ప్రధానం కాదు. ముందు ఎలా పోరాడామన్నదే ముఖ్యం. మన భారత మహిళల జట్టు పులుల్లా పోరాడింది. వాళ్లు మన హృద‌యాల‌ను గెలిచారు’ అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ కూడా భారత మహిళల జట్టుకి మద్దతు తెలుపారు. ‘భారత్ జట్టు ప్రపంచకప్ గెలుస్తుందని అంతా ఆశించాం. కానీ.. కప్ గెలవలేకపోయినా పోరాటంతో భారతీయుల మనసులను గెలిచారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.