రసవత్తరంగా తమిళ బిగ్ బాస్

0Tamil-Bigg-Bossఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ఇప్పుడు హిందీలోనే కాదు మొత్తం ఇండియాలోని చాలా బాషల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ వివాదాస్పద షో లో ఉండే టాస్క్ లు గాని అక్కడ గేమ్ లు గాని ఒకరకంగా సంచలన వార్తలుకు దారితీసే విదంగా ఉంటుంది. ఇప్పుడు కూడ తమిళ్ బిగ్ బాస్ మన బిగ్ బాస్ కన్నా కొంచం ముందు మొదలుపెట్టి అక్కడ చూసే వారికి తరువాత ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠను కలిగిస్తోంది. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ ఇప్పుడు రసవత్తరంగా మారింది.

తమిళ్ బిగ్ బాస్ గురించి ఇప్పుడు అక్కడ పెద్ద రాజకీయ చర్చే నడుస్తుంది. అక్కడ బిగ్ బాస్ లో పాల్గొనే వారిలో హీరోయిన్ ఒవియా కూడ ఉంది. ఈ మధ్య జరిగే ఒక ఎపిసోడ్ లో ఒవియా కాస్తా అధికప్రసంగం చేసి మొండిగా మాట్లాడి పెద్ద దుమారమే లేవదీసింది. ఒవియా తోపాటు గా మిగతా సభ్యులు నమిత గణేశ్ వెంకట్రామన్ ఈ వీకెండ్లో ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఒవియా కన్నీరు పెట్టుకొని ‘నువ్వు నోరు మూసుకో’ అంటూ ఇతర కంటెస్టంట్లు తిడుతుంటే.. ఆ మాట ఇప్పుడు తెగ ఫేమస్ అయ్యింది. తన అధికప్రసంగం వలన ఈ వారం బిగ్ బాస్ నుండి తొలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఒవియాకు మాత్రం సోషల్ మీడియా నుండి ఆమె అభిమానులు నుండి మంచి సపోర్ట్ వస్తుంది. ఒవియా అన్న మాటకు అక్కడ ఆమె ఫాన్స్ యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్దమే చేస్తున్నారు. ఒవియాను బయటకు పంపకూడదు అని సోషల్ మీడియా లో ఓట్లు కూడ సేకరిస్తున్నారు ఆమె అభిమానులు.

అయితే కమల్ హాసన్ ఈ డ్రామాకు ఈ వారం ముగింపు పలికే అవకాశం ఉంది. హీరోయిన్ నమిత.. గణేశ్ వెంకట్రామన్.. ఒవియాలలో ఎవరు బయటకు వెళ్తారు అనేది కొద్ది రోజులలో తెలియనుంది. ఈలోపు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒవియా ఆర్మీ ఒవియన్స్ అనే ట్రెండింగ్లు హాల్ చల్ చేస్తున్నాయి. జనాలు మామూలుగా రచ్చ చేయట్లేదు అనుకోండి.