మహర్షి: పాలపిట్ట.. వినేకొద్దీ నచ్చే పాట

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. మొదలు కావడం ఏంటి.. దాదాపు చివరిదశకు వచ్చేసింది. మరో పది రోజుల్లోనే ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి నాలుగు పాటలను రిలీజ్ చేసిన ‘మహర్షి’ టీమ్ తాజాగా ‘పాల పిట్ట’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

మరి ఈ ఐదో ఎలా ఉంది? జానపద బాణీలో సాగే ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ ఆడియన్స్ ను మెప్పించే ట్యూన్ ఇచ్చాడు. ది బెస్ట్ అని చెప్పలేం గానీ ఈ ఆడియోలో ఉన్న మంచి పాటలలో ఇదొకటి. మొదటిసారి వినగానే సూపర్ అనిపించకపోయినా వినేకొద్ది ప్రేక్షకులకు నచ్చే సాంగ్. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి. పాడినవారు రాహుల్ సిప్లిగంజ్.. ఎం ఎం మానసి. ఫోక్ స్టైల్ లో సాగే పాట కావడంతో అందమైన సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. మహేష్.. పూజా హెగ్డేల కాస్ట్యూమ్స్ కలర్ఫుల్ గా.. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

‘మహర్షి’ లో అల్లరి నరేష్.. జగపతి బాబు.. రావు రమేష్.. రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు-అశ్విని దత్-పీవీపీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ మే 9 న రిలీజ్ కానుంది.
Please Read Disclaimer