పద్మావతి ట్రైలర్‌కు రాజమౌళి ఫిదా

0Padmavatiవిడుదలైన 24 గంటల్లోనే కోటిన్నర వ్యూస్‌తో అదరగొట్టిన పద్మావతి ట్రైలర్‌కు దర్శక ధీరుడు రాజమౌళి ఫిదా అయిపోయాడు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని, ఓవరాల్‌గా ట్రైలర్ పిచ్చెక్కించేలా ఉందంటూ ట్విట్టర్‌లో పొగడ్తల వర్షం కురిపించాడు. ముఖ్యంగా డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ వర్క్‌కు జక్కన్న ఇంప్రెస్ అయ్యాడు. బాహుబలిలాంటి విజువల్ వండర్‌ను ఇండియన్ సినిమాకు అందించిన రాజమౌళికే ట్రైలర్ నచ్చడంతో పద్మావతిపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. రాజ్‌పుత్‌ల ఆందోళనలతో షూటింగ్ ఆలస్యమైన ఈ మూవీ.. డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్నది. దీనికి సంబంధించిన ట్రైలర్ సోమవారమే రిలీజైంది. దీపికా, రణ్‌వీర్, బన్సాలీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో అటు అభిమానులు రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో దీపికా రాణి పద్మావతిగా కనిపిస్తుండగా.. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్, మహారావల్ రతన్ సింగ్ రోల్‌ను షాహిద్ పోషిస్తున్నాడు.