స్టంపర్ టాక్: పూరి మార్కు ‘బాలయ్య’

0


తనతో పని చేసే ఏ హీరోనైనా తన స్టయిల్లోకి మార్చేస్తాడని పేరుంది పూరి జగన్నాథ్ కు. ‘పోకిరి’లో మహేష్ బాబు అయినా.. ‘దేశముదురు’లో అల్లు అర్జున్ అయినా.. చివరికి మొన్న వచ్చిన ‘ఇజం’లో కళ్యాణ్ రామ్ అయినా.. పూరి మార్కు హీరోలాగే కనిపిస్తాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సైతం పూరి స్టయిల్లోకి మారిపోయాడు. ఈ రోజు లాంచ్ అయిన ‘పైసా వసూల్’ స్టంపర్ చూస్తే అందులో బాలయ్య పూరి మార్కులోనే కనిపించాడు. పూరి స్టయిల్లో నిర్లక్ష్యంగా.. రూడ్ గా.. ఊర మాస్ గా కనిపిస్తూ పూరి మార్కు డైలాగులతో మోత మోగించేశాడు బాలయ్య.

‘‘అన్నా.. రెండు బాల్కనీ టికెట్లు కావాలి’’ అని బాలయ్య అనడంతో మొదలవుతుంది ఈ స్టంపర్. దానికి బదులుగా ‘‘ఇది సినిమా కాదు బే’’ అంటాడు రౌడీ. తర్వాత ‘‘సినిమా కాకపోతే ఇంకేటి.. ఐయామ్ ద హీరో.. యు ఆర్ ద కమెడియన్.. అండ్ విలన్ టార్చర్డ్ మై హీరోయిన్.. దిస్ ఈజ్ యన్ యాక్షన్ ఫిలిం’’ అంటూ విలన్ల మీదికి బాలయ్య దూకుతాడు. ఇక అక్కడి నుంచి ఈ స్టంపర్ అంతటా కూడా యాక్షనే యాక్షన్. ‘‘అన్నా నేను జంగిల్ బుక్ చూడలా.. అందులో సింహం నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు.. అది నిజమో కాదో మీరే చెప్పాలి’’.. ‘‘నేను మందేసిన మదపుటేనుగునురా.. క్రష్ ఎవ్రీవన్’’.. ఈ డైలాగులు కూడా అభిమానుల్ని అలరించేవే. ఈ స్టంపర్ చూస్తే కథేంటన్నది అర్థం కావడం లేదు కానీ.. ఇది పక్కా యాక్షన్ మూవీ అన్నది మాత్రం తెలుస్తోంది. రిచ్ ఫారిన్ లొకేషన్లలో.. భారీగానే సినిమాను తెరకెక్కించినట్లున్నారు. మొత్తానికి ‘పైసా వసూల్’లో బాలయ్యను పూరి తనదైన స్టయిల్లో ప్రెజెంట్ చేసేలా కనిపిస్తున్నాడు ఈ స్టంపర్ చూస్తుంటే.