పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్

0నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. అనుకున్న సమయం కన్నా నెల రోజులు ముందుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఔట్ అండ్ ఔట్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రేయా, ముస్కాన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా కైరా దత్ ఐటెం సాంగ్ తో అలరించనుంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా స్టంపర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ‘నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..’ అంటూ సాగే ఈ పాట నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆగస్టు 17న ఈ సినిమా ఆడియో వేడుక ఖమ్మంలో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.