పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు

0

paladugu venkatrao passed awayగత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు… అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోగులంపాడు గ్రామానికి చెందిన పాలడుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు.

నూజివీడు నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పాలడుగు మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 1968లో విద్యార్థి నాయకునిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1972లో ఎమ్మెల్సీగా ఎన్నికయి 1978వరకు కొనసాగారు.

1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పౌర సరఫరా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.

Tags : paladugu venkatrao Wiki, paladugu venkatrao died, paladugu venkatrao dead, paladugu venkatrao Profile, paladugu venkatrao family, paladugu venkatrao passed away, పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు

 
Please Read Disclaimer