పా.పా.తు రూ.4 కోట్లు

0


pandavulu pandavulu tummeda Satellite Rightsశాటిలైట్ మార్కెట్ విప‌రీతంగా ప‌డిపోయింది. దాదాపు 800 చిత్రాలు శాటిలైట్ హ‌క్కుల కోసం ఎదురుచూస్తున్నాయ‌న్ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచార‌మ్‌. అయితే… వినోదాత్మక చిత్రాల్ని టీవీ చాన‌ళ్లు ఎగ‌రేసుకుపోతాయ్ అనే విష‌యాన్ని పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద చిత్రం నిరూపించింది. మంచు ఫ్యామిలీ అంతా క‌ల‌సి న‌టించిన చిత్రం పా.పా.తు. శ్రీ‌వాస్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గర నిల‌బ‌డ‌లేక‌పోయింది. అయితే ఫ్యామిలీ అంతా క‌ల‌సి చూసే ల‌క్షణాలు ఉండ‌డంతో ఈ చిత్రానికి శాటిలైట్ రేటు బాగానే గిట్టింది. రూ.4 కోట్లకు ఈ చిత్రాన్ని మాటీవీ సొంతం చేసుకొంది. మ‌రో మంచు మూవీ రౌడీకీ మంచి రేటే ప‌లికే అవ‌కాశం ఉంద‌ని స‌మాచార‌మ్‌. ఎందుకంటే ఇది రాంగోపాల్ వ‌ర్మ సినిమా క‌దా?  దానికి తోడు ఈ సినిమాపై కూడా అన్నో ఇన్నో అంచ‌నాలున్నాయి. మ‌రి రౌడీకి ఎంత ప‌లుకుతుందో చూడాలి.