టీజర్ టాక్: సీమ పొగరున్న పందెంకోడి!

0పదమూడేళ్ళ క్రితం విశాల్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పందెంకోడి’ సూపర్ హిట్ గా నిలిచి విశాల్ కు మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఇద్దరూ మరో సారి ఆ సినిమాకు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పందెంకోడి 2’ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈరోజే రిలీజ్ అయింది.

విశాల్ సినిమాలంటేనే మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఇక ‘పందెంకోడి’ సీక్వెల్ నుండి ప్రేక్షకులు ఆశించే యాక్షన్ ను ఫుల్ గా ఇస్తునట్టు టీజర్ లో క్లారిటీ ఇచ్చాడు లింగుస్వామి. జాతరలో విశాల్ తండ్రి పాత్ర పోషించిన రాజ్ కిరణ్ గ్రామపెద్దగా ఎంట్రీ – కట్ చేస్తే విశాల్ రౌడీలను దుమ్ముదులిపే షాట్ సినిమా థీమ్ ను మరో సారి గుర్తు చేశారు. విశాల్ “నేను ఇంకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు.. అడ్డుకోవడమే మొదలు పెట్టాను” అనే పవర్ ఫుల్ డైలాగ్ మాస్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేదే. ఇక కీర్తి సురేష్ ఎనర్జిటిక్ అమ్మాయిగా లంగా ఓణీల్లో చిందులేస్తూ ఫస్ట్ పార్ట్ హీరోయిన్ మీరా జాస్మిన్ ను గుర్తు తెచ్చింది. మరో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ పోషిస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు.

శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ సూపర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినా జాతర సెటప్ కలర్ ఫుల్ గా ఉంది. ఇక టీజర్ లో స్టాండ్ అవుట్ గా నిలిచేది యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ప్రేక్షకుల్ని అరసెకండ్ లోకే సినిమా మూడ్ లోకి తీసుకెళ్ళాడు. చూస్తుంటే ప్రేక్షకులకు విశాల్ మరో సారి మాస్ జాతర చూపిస్తాడేమో అనిపిస్తోంది. ఈ సినిమాను టాప్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్ కు – భారీ రిలీజ్ కు ఢోకా ఉండకపోవచ్చు. కాబట్టి విశాల్ కు దాదాపు మరో హిట్ కన్ఫాం అయినట్టే!