హానర్ కిల్లింగ్స్ బ్యాక్ డ్రాప్ తో సుప్రీమ్ తమ్ముడు ?

0

ఇటీవలే పేరులో ధరమ్ తీసేసి ఆరు డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి రూపంలో ఓ మాదిరి ఫలితాన్ని అందుకున్న సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇటీవలే స్టార్ట్ అయిన షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ఇకపోతే రెండు రోజులు క్రితం దీనికి జాలరి అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అందరూ కాసేపు దాన్నే నిజమనుకున్నారు. కానీ అది వాస్తవం కాదు.

మరో అప్ డేట్ ప్రకారం ఇందులో హీరో జాలరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నటిస్తుండగా హీరోయిన్ బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. దీని థీమ్ పరువు హత్యల నేపధ్యంలో సాగుతుందని ఇన్ సైడ్ టాక్ గతంలో మెగా అల్లు కాంపౌండ్ ల నుంచి వచ్చిన హీరోల్లో శిరీష్ ఇలాగే తన డెబ్యూ మూవీ గౌరవంలో సున్నితమైన ఈ పాయింట్ తోనే మూవీ చేశాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ సబ్జెక్టు పరంగా పేరైతే వచ్చింది.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కు అలాంటి నేపధ్యాన్ని తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్. జాలరి టైటిల్ క్యాచీ ఉంది కాబట్టి దాన్నే ఫిక్స్ చేసినా ఆశ్చర్యం లేదేమో. బుచ్చి బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ కానుంది. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టైటిల్ తో పాటు మిగిలిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారు
Please Read Disclaimer