భాస్కర్ ను పట్టించుకునే నాధుడు లేరట..

0భాస్కర్ ఈ పేరు అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ బొమ్మరిల్లు భాస్కర్ అంటే మాత్రం అందరికి గుర్తు వస్తుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈయన , ఆ తర్వాత అల్లు అర్జున్ తో పరుగు అనే మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆరెంజ్ చిత్రం చేసాడు. ఈ మూవీ డిజాస్టర్ కావడం తో భాస్కర్ కెరియర్ ముగిసిపోయినట్లు అయ్యింది. ఈ మూవీ వల్ల నిర్మాత నాగబాబు మళ్లీ సినిమా జోలికి పోకుండా అయిపోయింది.

భాస్కర్ వల్లే సినిమా ప్లాప్ అయ్యిందని , బడ్జెట్ కూడా అతిగా పెట్టించి సినిమా ప్లాప్ కు కారణమయ్యాడని ప్రచారం కావడం తో ఏ నిర్మాతకూడా భాస్కర్ తో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. ఆ మధ్య రామ్ తో ఒంగోలు గిత్త అనే సినిమా చేసినప్పటికీ అది కూడా డిజాస్టర్ కావడం తో భాస్కర్ ఎన్ని కథలు వినిపించిన ఏ హీరో కూడా సినిమా చేసేందుకు ఒప్పుకోవడం లేదట. కొంతమంది అయితే కనీసం కథ వినేందుకు కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. మరి భాస్కర్ ను ఎవరు ఆదుకుంటారో చూడాలి.