పొలిటికల్ గేమ్ లో ఇరుక్కున్న డాక్టర్

0

త్రిష తాజా తమిళ చిత్రం ‘పరమపదం విలయాట్టు’ ట్రైలర్ రీసెంట్ గా విడుదల అయింది. త్రిష కెరీర్ లో 60 వ సినిమా ఇది. ఈ సినిమాకు దర్శకుడు తిరుజ్ఞానం. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష ఒక డాక్టర్ పాత్రలో నటించింది. ఒక పాపకు అమ్మగా కూడా నటించడం మరో హైలైట్.

ట్రైలర్ కాన్సెప్ట్ లోకి వెళ్తే ప్రతిపక్ష నాయకుడు చెళియన్ ఆరోగ్యం దెబ్బ తినడం తో ఆయనను హాస్పిటల్ లో ఉంచి 15 రోజుల పాటు ట్రీట్ మెంట్ అందిస్తారు. ఆయన ఆరోగ్యం మెరుగయిందని ప్రకటించే లోపు ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతుంది. ఆయన అడ్మిట్ అయిన వార్డ్ లో అన్నీ సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయిస్తారు. అక్కడ డాక్టర్ గా ఉన్న త్రిష ను వారు చెప్పినట్టు చేయమంటారు. కానీ “మీరు చెప్పేదంతా చెసేందుకు నేను మీ పార్టీ కార్యకర్తను కాను” అంటూ వారిని ఎదిరిస్తుంది. దీంతో “మీ మీ పాప డెఫ్ అండ్ డంబ్ అని నేను విన్నాను డాక్టర్” అంటూ బెదిరిస్తారు. త్రిష కూతురుని కిడ్నాప్ చేస్తారు. ఇక రాజకీయ కుట్ర నుంచి తనను తాను ఎలా కాపాడుకుంది.. కూతురిని ఎలా రక్షించుకుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ లా కనిపిస్తోంది.

ఇలాంటి సినిమాల్లో ఈమధ్య నయనతార నటిస్తోంది.. ఫర్ ఎ చేంజ్ త్రిష ను చూడడం డిఫరెంట్ గా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ కథలను హీరోలు ఎక్కువగా చేస్తుంటారు. మరి త్రిష ఇలాంటి సినిమాలో ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ట్రైలర్ పై ఒక లుక్ వేయండి. మరీ డైలాగ్స్ అర్థం కాకపోతే సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని చూడండి.
Please Read Disclaimer