గోవిందుడుని వర్జిన్ లా చూడకండి!

0ఈ నెల 15న విడుదల కాబోతున్న గీత గోవిందం మీద అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత చేస్తున్న మూవీ కాబట్టి హైప్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ప్రమోషన్ చేసిన తొలినాళ్ళలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పదే పదే నేను వర్జిన్ అని చెప్పుకోవడం యూత్ లోకి బాగా వెళ్ళిపోయింది. కథ కూడా ఆ పాయింట్ చుట్టే ఉంటుందనే కోణంలో విశ్లేషణలు మొదలుపెట్టారు. దర్శకుడు పరశురామ్ దానికి క్లారిటీ ఇచ్చేసాడు. అది కేవలం కథలో ఓ పాయింట్ గా వస్తుందే తప్ప దాని ఆధారంగా కథ రాసుకోలేదని చెప్పేసాడు. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి నుంచి వచ్చిన బోల్డ్ ఇమేజ్ నుంచి బయటికి తీసుకువచ్చి ఫ్రెష్ గా ఒక లవర్ బాయ్ గా ప్రెజెంట్ చేసిన తీరు తప్పకుండా ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసాడు. ఇది పూర్తిగా కొత్త తరహాలో ఉంటూ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశామని చెప్పాడు.

మొత్తానికి పరుశురాం మాటలను బట్టి చూస్తే గీత గోవిందం క్లీన్ లవ్ స్టోరీ అనే అండర్ స్టాండింగ్ వచ్చేసినట్టే. ఇప్పటికే గోపి సుందర్ ఆడియో బాగా రీచ్ అయిపోగా ఇంకేం కావాలే అనే పాటే లేని యూత్ స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఆల్బమ్ గురించి పూర్తి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపధ్యంలో ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. పోటీ లేకుండా బరిలో దిగుతున్న గీత గోవిందంకు బాలీవుడ్ గోల్డ్ మూవీతో తప్ప ఇంకే ఇబ్బంది లేదు. అర్జున్ రెడ్డి వచ్చేసి ఏడాది దాటినా దాని హ్యాంగ్ ఓవర్ లోనే విజయ్ దేవరకొండ నుంచి సినిమా ఆశిస్తున్నా ప్రేక్షకులకు గీత గోవిందం స్వీట్ సర్ప్రైజ్ లా ఉంటుందన్న పరశురామ్ మాటల్లో ఎంతవరకు నిజముందో తేలాలంటే ఇండిపెండెన్స్ డే ఆగాల్సిందే.