గోవిందం హిట్టయితే ఏకంగా స్టైలిష్ స్టారే!

0రెండు పెగ్గులేస్తే స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయని – హెవెన్ లో ఉండే హైవేస్ మనకు నియాన్ ల్యాంపుల లైటింగ్ లో అగుపడతాయని అంటారు మందుబాబులు. కానీ ఆ సంగతి తెలియాలంటే మీకు ఆ అలవాటు ఉండాలనేది కండిషన్! దీనికే కాదు ఈ పెపంచకం లో చాలావాటికి కండిషన్లు ఉంటాయి. అంతెందుకు.. ఏ ఆఫర్ కైనా కింద ఓ స్టార్ మార్క్ పక్కన ‘కండిషన్స్ అప్లై’ అనే చిన్న స్టేట్మెంట్ ఉంటుంది.

ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ పరశురామ్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. ఈ జాక్ పాట్ ఆఫర్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పరశురామ్ కు ఇచ్చాడని టాక్. కానీ.. దానికి కండిషన్స్ అప్లై అనే స్టార్ మార్క్ ఉంది. పరశురామ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ ఆగష్టు 15 న రిలీజ్ కానుంది. అసలే టాలీవుడ్ సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరో. సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే అల్లు అర్జున్ సినిమా అవకాశం ఇస్తానని అరవింద్ గారు చెప్పారట. ఇప్పటికే పరశురామ్ ఓ రెండు స్టొరీ లైన్స్ అరవింద్ కు వినిపించాడట.

పరశురామ్ కు ఫ్యామిలీ డ్రామాలు – రొమాంటిక్ కామెడీ స్క్రిప్ట్ లు రాయడంలో మంచి పట్టుందని టాక్. పూరి జగన్నాధ్ స్కూల్ నుండి వచ్చిన ఈ డైరెక్టర్. ఇప్పటికే ‘యువత’.. ‘సోలో’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు గానీ బ్రేక్ మాత్రం రాలేదు. మరి ‘గీత గోవిందం’ హిట్టయితే ఇక ఏకంగా బన్నీనే! అన్నట్టు ఈ పరశురామ్ కు మైత్రీ బ్యానర్ లో కూడా ఓ కమిట్ మెంట్ ఉందట.