సైనా నెహ్వాల్ బయోపిక్.. శ్రద్ధ ఔట్!

0

బ్యాడ్మింటన్ స్టార్ – తెలుగమ్మాయి సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్. శ్రద్ధా కపూర్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా.. ఆమోల్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసమే శ్రద్ధా ఏడాది కాలంగా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తోంది. పుల్లెల గోపిచంద్ సైనా ల వద్ద హైదరాబాద్ లో కొంతకాలం పాటు ట్రైనింగ్ తీసుకుంది. అయితే ఏడాది కాలంగా ఈ బయోపిక్ గురించి వార్తలు వస్తున్నా.. చిత్రీకరణకు సంబంధించిన సరైన సమాచారం లేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రద్ధా కపూర్ ను దర్శకనిర్మాతలు తొలగించారని తెలుస్తోంది. శ్రద్ధా ఆ పాత్రకు యాప్ట్ కాలేదు. ఇన్నాళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా సైనా పాత్రతో సరైన సింక్ కుదరలేదు. పైగా తనకు ఉన్న ఇతర షెడ్యూల్స్ వల్ల ఇప్పటికే పలుమార్లు దర్శకనిర్మాతల్ని ఇబ్బంది పెట్టిందట. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తనని తప్పించి పరిణీతి చోప్రాని నాయికగా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఆ మేరకు ప్రఖ్యాత బాలీవుడ్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించడం సంచలనమైంది. అయితే ఏడాది పాటు శిక్షణ తీసుకున్న తర్వాత కూడా శ్రద్దాతో నిర్మాతలకు ఎందుకు కుదరలేదు? అంతగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ కాలేకపోతోందా? ఇతర సినిమాల హడావుడిలో దృష్టి సారించలేకపోయిందా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చా సాగుతోంది.

వాస్తవానికి 2017 ఏప్రిల్ నుంచి శ్రద్ధా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ప్రారంభమే శ్రద్ధా నుంచి సరైన కోఆపరేషన్ లేదన్న విమర్శలు వచ్చాయి. దానిపై అప్పట్లోనే బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. బ్యాడ్మింటన్ ట్రైనింగ్ షెడ్యూల్స్ ప్రకారం శ్రద్ధ కోఆపరేట్ చేయలేకపోయిందట. ఇదే విషయంపై `స్త్రీ` ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ మీడియా నుంచి శ్రద్ధా ప్రశ్నలు ఎదుర్కొంది. కానీ సరైన సమాధానం రాలేదు. తాజా అప్ డేట్ ప్రకారం.. శ్రద్ధా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రద్ధా లాస్ .. పరిణీతి గెయిన్! అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంత డిలే తర్వాత పరిణీతి జాయిన్ అయ్యింది కాబట్టి ఈ ప్రాజెక్టు మళ్లీ మొదటికి వచ్చినట్టేనా? పరిణీతికి శిక్షణనిచ్చి అప్పుడే చిత్రీకరణకు వెళ్లాల్సి ఉంటుందా? అన్నది వేచి చూడాలి.
Please Read Disclaimer