పరిటాల శ్రీరామ్‌కు పెళ్లి కుదిరింది..!

0Paritala-Sriram-Marriage-Fiతెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కు పెళ్లి కుదిరింది. ఈ విషయాన్ని సునీత స్వయంగా ప్రకటించారు. పెళ్లి ముహూర్తాన్ని కూడా ఆమె ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీన శ్రీరామ్ పెళ్లి ఉంటుందని ఆమె వివరించారు. శ్రీరామ్ కు పెళ్లి కుదిరినట్టుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునీత కుమారుడి పెళ్లిపై ప్రకటన చేశారు.

మరి పెళ్లి కూతురు ఎవరంటే… ఆమెది కూడా అనంతపురం జిల్లానే అని తెలుస్తోంది. జిల్లాలోని శింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలకు చెందిన ఆలం జ్ఞాన‌ను శ్రీరామ్ పెళ్లాడనున్నట్టుగా సునీత ప్రకటించారు. పెళ్లికూతురు తండ్రి ఒక కాంట్రాక్టర్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని అని సమాచారం. ఆగస్టు పదో తేదీన శ్రీరామ్ నిశ్చితార్థం అని.. అక్టోబర్ ఒకటో తేదీన పెళ్లి అని సునీత వివరించారు.

తెలుగుదేశం పార్టీ దివంగత ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర, మంత్రి పరిటాల సునీతల పెద్ద కుమారుడు శ్రీరామ్. ఇతడికి ఒక తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు.