పటాస్ షో ఆర్టిస్ట్ అరెస్ట్..

0ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ షో తో పాపులర్ అయినా ఆర్టిస్ట్ నరేందర్ దొంగ గా మారాడు. పక్క ఆధారాలతో పోలీసులు అతడి నుండి సుమారు రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

పటాస్ షో కు రాకముందు నరేందర్ భవననిర్మాణ కార్మికుడిగా పనిచేసాడు. ఆ తర్వాత పటాస్ షో లో పాల్గొని పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కొద్ది కాలానికే అతను విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. షో ద్వారా వచ్చే ఆదాయం చాలక దొంగతనాలు మొదలుపెట్టాడు. బైక్‌పై రెక్కీ తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి రాత్రే ఆ ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఓ ఇంట్లో దొంగతనికి పాల్పడుతుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసారు.. అతడిని విచారించగా గతం లో చేసిన దొంగతనాలను బయటకు చెప్పాడు.