నెలాఖరులో జగపతిబాబు ‘పటేల్ సర్’

0Patel-Sir-First-Lookరూట్ మార్చి విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో చేస్తున్న చిత్రం ‘పటేల్ సర్’. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో జగ్గూభాయ్ చాలా కొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అంతేగాక చాలా రోజుల క్రితమే విడుదలైన టీజర్ కు కూడా బ్రహ్మాండమైన స్పందన లభించింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలఖారున విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి స్వయంగా తెలిపారు. నూతన దర్శకుడు వంశీ పరిమి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ‘అందరి బంధువయా’ ఫేమ్ పద్మప్రియ హీరోయిన్ గా నటిస్తుండగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తో మెరిసిన తాన్య హోప్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది.