పవన్ కళ్యాణ్ పార్టీ పేరు ఇదే నా!?

0Pawan Kalyan Starting His Political Partyరాష్ట్ర విభజన ఉద్యమం గత ఎనిమిది నెలలుగా రాష్ట్రాన్ని కుదిపేసి చిట్టచివరకు రాష్ట్ర విభజన ముగియడంతో ఇక నెమ్మదిగా పరిస్థుతులు ఒక కొలిక్కి వచ్చి ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాలలోను ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వాలతో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది అని అనుకున్నారు అంతా. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్నీ ఎన్నికలకు సమాయుక్తం అవుతున్న నేపధ్యంలో మొన్న ఆదివారం పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ మీడియానే కాదు రాజకీయ పార్టీలనే కుదిపేస్తోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశానికి సంబంధించి మీడియా సమావేశం వచ్చే వారం జరగబోతున్న నేపధ్యంలో పవన్ రాజకీయపార్టీ పెడతాడో లేదో తెలియకపోయినా అప్పుడే పెట్టబోయే పార్టీ పేర్లు ఇవే అంటూ రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ అప్పుడే రెండు మూడు పేర్లను కూడ పరిశీలిస్తున్నాడని తెలుప్తోంది. పవన్ సన్నిహితులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, శరత్ మరార్, ఆనంద్ సాయి లతో పాటు మరికొందరు పవన్ పెట్టబోయే కొత్త పార్టీ రంగు, రూపు కోసం తలమునకలై ఆలోచనలు చేయడమే కాకుండా ఎలక్షన్ కమీషన్ దగ్గర పేరు ఎప్పుడు ఎలా నమోదు చేయించాలి అన్న విషయo పై విపరీతమైన మేధోమధనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా ఈ కొత్త పార్టీకి కూడా పీఆర్పీ అని వచ్చేలా తన పార్టీ పేరుండాలని పవన్ సూచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ ‘పార్టీకి పవన్ రిపబ్లికన్ పార్టీ’ (పిఆర్పి) అనే పేరు పెట్టే ఆలోచన చేస్తున్నారట వీరందరు. అలా కుదరకపోతే ‘యువరాజ్యం’ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.  అన్నీ కుదిరితే ఈనెల 9న కానీ, 11న కానీ పవన్ మీడియా సమావేశం ఉంటుంది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉంటే పవన్ పెట్టబోయే మీడియా సమావేసానికి సంబంధించిన విషయాల పై జాతీయ పార్టీల నేతలు కూడా రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆరాతీస్తున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారు అన్న ప్రచారంలా కాకుండా ఇది వాస్తం అవునా కాదా అన్నది మరి కొద్దిరోజులలో తేలిపోతుంది.