పవన్ చెప్పడం తో ఆ పుస్తకానికి ఫుల్ డిమాండ్..

0జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ , ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నాడు. ఇచ్ఛాపురం నుండి మొదలైన ఈ యాత్ర ప్రస్తుతం విజయనగరం చేరుకుంది. 42 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.

ఇక ఈ యాత్ర లో ఎక్కువగా పవన్ ఉద్దానం సమస్య గురించి మాట్లాడుతూ, ఒక పుస్తకం గురించి చెబుతుండటం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి..? అందులో ఏముందనేది తెలుసుకుంటే..‘ఉద్దానం – కళింగాంధ్ర వ్యాసాలు’ అని పేరుతో నారాయణ మూర్తి బల్లెడ అనే రచయిత గత 12 ఏళ్లుగా ఉద్దానం, ఉత్తరాంధ్ర లోని సమస్యలను ఆ పుస్తకంలో రాస్తున్నాడు. నాటక కర్త వ్యాసాలను ప్రచురించాలని ఉద్దానం యువత అనుకున్నారు. దానికోసం కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు కలసి ఉద్దానం ప్రచురణలు పేరిట పుస్తకం తెచ్చారు.

ఇటీవలే ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ చదవడం జరిగింది. అందులో ఉత్తరాంధ్ర ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చాల క్లియర్ గా రాసారు. దీంతో పవన్ వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ , ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దీంతో అందరి కళ్లు ఈ పుస్తకం ఫై పడింది. చాలామంది ఈ పుస్తకం గురించి ఆరా తీస్తున్నారు.