తాను స్పెషల్ అనిపించుకున్న పవన్

0Pawan-in-press-meetపవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక రాజకీయ శక్తి కూడా. ప్రశ్నించడానికే పార్టీ అంటూ జనసేనను ప్రారంభించిన పవర్ స్టార్.. తన విభిన్నమైన వ్యక్తిత్వంతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. తనను అభిమానించడాన్ని పవనిజం అంటూ ఓ ప్రత్యేక మతం రేంజ్ లో ఫీల్ అయ్యే రేంజ్ కి చేరుకున్నాడు.

ఇప్పుడు జనసేన పార్టీని ప్రారంభించి మూడేళ్లు గడిచిన సందర్భంగా.. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడాడు. పార్టీ గురించి.. భవిష్యత్ వ్యూహాల గురించి చాలానే చెప్పాడు. పొత్తుల గురించి.. పోటీ గురించి.. ఎన్డీయేలో భాగం గురించి.. తెలంగాణలో పార్టీ పటిష్టం గురించి.. ఇలా ఎన్నో విషయాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒక్క విషయంపై మాత్రం నోరు మెదపలేదు. అదే.. పది రోజుల్లోనే విడుదల కానున్న పవన్ పవర్ఫుల్ మూవీ కాటమరాయుడు. సహజంగా సినిమా స్టార్లు ఎవరైనా.. ఏ సందర్భం దొరికినా తమ సినిమా ప్రచారానికి వాడేసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తారు.

పబ్లిక్ యాక్టివిటీస్ కూడా సినిమా రిలీజ్ సమయానికే ప్లాన్ చేసుకుంటారు. కానీ అందరిలా చేస్తే.. పవన్ ఎందుకు స్పెషల్ అవుతాడు? సినిమా గురించి మాట్లాడేందుకు.. జనసేన వేదిక సరికాదని భావించి ఉంటాడు పవర్ స్టార్. అందుకే అక్కడ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన ప్రత్యేకతను చూపించి.. దటీజ్ పవన్ అనిపించేశాడు.