ప్రజారాజ్యం తప్పులు మళ్ళీ జరగవ్ : పవన్ కళ్యాణ్

0



pawan-kalyanజనసేన నిర్వహిస్తోన్న శిబిరాల గురించి, అందులో పాల్గొంటున్న యువ‌త గురించి ఈ రోజు ఆ పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ కల్యాణ్ మాట్లాడారు. శిబిరాల్లో కొన‌సాగుతోన్న ఎంపిక‌ల ప్ర‌క్రియ విధానం, పాల్గొన్న యువ‌త ఇచ్చిన స్పీచ్‌ల వీడియోల‌ను హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో చూశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ పాల‌కులు చేస్తోన్న త‌ప్పుకి ప్రజ‌లు ఇబ్బంది ప‌డుతుండ‌డం చూసి తాను చ‌లించిపోయానని అన్నారు.

అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు అందులో జ‌రిగిన త‌ప్పు ఒప్పుల‌ను ప‌రిశీలించానని, అందులో జ‌రిగిన త‌ప్పుల‌ను మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూస్తున్నాన‌ని చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావాలనిచెప్పిన పవన్. అందుకే ఇలా ఎంపిక‌లు చేస్తున్నామ‌ని స్పష్టం చేశారు.