భారీగా అమ్ముడుపోతున్న పవన్ సినిమా రైట్స్

0Pawan-Kalyan-Trivikram-Movieపవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలు.. అప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ బద్దలయిపోతూ ఉంటాయి. నిజానికి పవర్ స్టార్ కెరీర్ లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. ప్రతీ సినిమాతో తన క్రేజ్ పెంచుకునే తీరు మాత్రం ఎవరికీ సాధ్యం కాదు.

చివరగా అత్తారింటికి దారేది తర్వాత.. పవన్ కళ్యాణ్ కు సరైన సక్సెస్ రాలేదు. గోపాలా గోపాలా యావరేజ్ గా నిలవగా… సర్దార్.. కాటమరాయుడు చిత్రాలు నిరుత్సాహపరిచాయి. అయితే.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో.. అప్పటివరకూ ఉన్న రికార్డులు అన్నిటినీ పవన్ తుడిచిపెట్టేశాడు. దాదాపు అన్ని ఏరియాల్లోనూ నాన్ బాహుబలి రికార్డులన్నీ పవన్ ఖాతాలోకి వచ్చేశాయి. ఆ తర్వాత రెండు ఫెయిల్యూర్స్ వచ్చినా.. మళ్లీ ఇప్పుడు సేమ్ ఫీట్ రిపీట్ అవుతోంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంతో.. బాహుబలి2 కాకుండా.. మిగిలిన రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు ట్రేడ్ పండిట్స్ .

అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి భారీ రేట్లతో ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పుడీ చిత్రం సీడెడ్ రైట్స్ ను 16 కోట్లకు విక్రయించారనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియకపోయినా.. సెలవుల సీజన్ లో విడుదలయ్యే ఛాన్స్ లేకపోయినా.. ఇంత మొత్తం ప్రీ రిలీజ్ కేవలం పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యం. ఈ లెక్కన అమ్ముకుంటే పోతే.. ప్రీ రిలీజ్ 100 కోట్లనో 120 కోట్లో టచ్ చేయొచ్చు కాని.. తేడా పడితే మాత్రం.. మళ్లీ సర్దార్ అండ్ కాటమరాయుడు డివిడి తరహాలో అయిపోతుంది పరిస్థితి.