నితిన్ కోసం పవన్-త్రివిక్రమ్ త్యాగం

0Pawan-kalyan-And-Trivikram-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ తర్వాత పెద్దగా గ్యాప్ ఏమీ తీసుకోకుండానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. రెండు నెలల పాటు నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. ఈ చిత్రాన్ని దసరా రేసులో నిలబెట్టాలన్న పట్టుదలతో వేగంగా షూటింగ్ చేశారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో.. ఈ చిత్రాన్ని దసరాకు కాకుండా.. సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచన మార్చుకున్నారు. ఎలాగూ సినిమా వాయిదా అనేసరికి.. ఇప్పుడు పవన్.. త్రివిక్రమ్ షూటింగ్ విషయంలో అంత పట్టుదలగా ఏమీ లేనట్లుగా తెలుస్తోంది. పవన్ ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుని రెడీగా ఉంటే.. నాలుగు రోజుల పాటు షూటింగుకి గైర్హాజరయ్యాడట.

అదలా ఉంటే.. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా షూటింగుకి లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అది నితిన్ కోసమే అంటున్నారు. పవన్.. త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వ్యవహారాల్ని త్రివిక్రమ్ స్వయంగా పర్యవేక్షించి.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారట. పవన్ కూడా కొంచెం విశ్రాంతి తీసుకుని.. రాజకీయ వ్యవహారాల్ని కొంచెం చక్కబెట్టాల్సి ఉండటంతో ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. నెలకు పైగా విరామం తర్వాత షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశముంది. దీన్ని బట్టి ఈ చిత్రం దసరా రేసులో లేనట్లే అని రూఢి అయిపోయింది.