ఆ వార్త చూసి పవన్ కు కోపం వచ్చిందట..

0pawan-kalyanఇటీవల వైరల్ గా మారిన ఓ వార్త చూసి పవన్ కళ్యాణ్ కోపం వచ్చిందట..అంతే తన పక్కన వారిదగ్గర ఎలాంటి వార్తలు ఎలా ప్రకటిస్తారు..ఎటువంటి ఆధారం లేకుండా ఎందుకిలా ప్రవర్తిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడట..ఇంతకు ఆ వార్త ఏంటి అని అనుకుంటున్నారా..నాల్గు రోజుల క్రితం టి.సుబ్బిరామిరెడ్డి చిరంజీవి – పవన్ కలయిక లో ఓ మూవీ రాబోతుందని , దానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడని ప్రకటించాడు. ఈ వార్త తో ఒక్కసారిగా మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక మెగా అభిమానుల సంబరాలు ఆకాశానికి అందుకున్నాయి..

ఈ వార్త చూసి పవన్ కు కాస్త కోపం వచ్చినట్లు అతని సన్నిహితులు చెపుతున్నారు. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు చేస్తున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా ఏఎమ్ రత్నం నిర్మాతగా మరో సినిమా చేయాల్సి వుంది. వాటితో పాటు మైత్రీ మూవీస్ సంస్థ అడ్వాన్స్ కూడా ఉందట. మరోవైపు త్రివిక్రమ్ సైతం పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబు లతో సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ వుండగా సుబ్బరామిరెడ్డి ఇలా ఎందుకు ప్రకటించారో ఆయనకే తెలియాలి అంటూ పవన్ అన్నాడట..ఈ వార్త బట్టి చూస్తే పవన్- చిరు ల కలయిక లో సినిమా లేనట్లే అనిపిస్తుంది.