జనసేన వెనుక బిజెపి.. ఇది క్లియర్

0తనకు రాజకీయ వ్యూహకర్తగా దేవ్ అనే వ్యక్తిని పవన్ కల్యాణ్ పరిచయం చేయడం చర్చనీయంశమైయింది. జనసేన అనుబంధ విభాగమైన ‘ఏసీఎఫ్’లో సభ్యులుగా ఉన్న 1200 మందిని సమన్వయం చేసుకుంటూ, తనకు రాజకీయ వ్యూహకర్తగా దేవ్ ఉంటారని పవన్ కళ్యాణ్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్.

అసలు ఈ దేవ్ ఎవరంటూ వెతికిన వారు పలు కొత్త విషయాలను బయటకు తెస్తున్నారు. ఈ దేవ్ బీజేపీ కార్యకర్తని చెబుతూ కొన్ని వీడియోలు, పోస్టర్లు, ప్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతని అసలు పేరు వాసుదేవ్ కాగా గతంలో తనను తాను బీజేపీ నేతగా పరిచయం చేసుకుంటూ ముద్రించిన పోస్టర్లు, ప్లెక్సీలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో జనసేన వెనుక బిజెపి వుందని నిర్ధారించుకునే పరిస్థితి వచ్చింది.