అభిషిక్త్‌ భార్గవ ల పవన్ కళ్యాణ్

0Agnyaathavaasi-Premiersసంజయ్‌ సాహు.. గౌతమ్‌‌ నంద.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన సినిమాల్లోని హీరో పేర్లివి. మామూలుగా సినిమాల్లో హీరో పేర్లు సాధారణంగానే ఉంటుంటాయి. కానీ త్రివిక్రమ్‌ చేసే ఏ పనిలోనూనా ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆయన సినిమాలకు అందించే మాటల్లోనే కాదు హీరో పాత్రల పేర్లలోనూ పవర్‌ ఉంటుంది.

త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘జల్సా’ సినిమాలో పవన్‌ పేరు సంజయ్‌ సాహు. ‘అత్తారింటికి దారేది’లో గౌతం నంద. ‘జులాయి’లో అల్లు అర్జున్‌ పేరు రవీంద్ర నారాయణ్‌. ఇప్పుడు రాబోతున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ పాత్రకు అభిషిక్త్‌ భార్గవ అని పేరు పెట్టారట.

సినిమాలో అందరూ పవన్‌ను ముద్దుగా ఏబీ(అభిషిక్త్‌ భార్గవ) అని పిలుస్తుంటారట. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. హారిక-హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను తెరకెక్కించింది. అను ఇమ్మా్న్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.