‘కబాలి’ని కొట్టేసిన ‘కాట‌మ‌రాయుడు’

0Katamarayudu-New-Posterపవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు పై.. ఇప్పటివరకూ ఓ లెక్క.. టీజర్ వచ్చాక ఓ లెక్క అన్నట్లుగా ఉంది వ్యవహారం. పవన్ ఈ సినిమాపై అంతగా దృష్టి పెట్టడం లేదని.. తక్కువ బడ్జెట్ లో తీస్తున్నారని.. పేరున్న యాక్టర్స్ ని తీసుకోలేదని.. అశలు సినిమాపై ఏ మాత్రం బజ్ లేదని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ వినిపించాయి.

అయితే.. నిన్న కాటమరాయుడు టీజర్ వచ్చాక మొత్తం సీన్ అంతా మారిపోయింది. తెలుగు ఆడియన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అయిపోయాయి. కాటమరాయుడు టీజర్ కి 1 మిలియన్ వ్యూస్ రికార్డును అందుకునేందుకు కేవలం 2 గంటల సమయం పట్టింది. ఇప్పటివరకూ ఈ రికార్డు మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 పేరిట ఉంది. 3 గంటల 5 నిమిషాల్లో ఈ మార్క్ ను అందుకున్న ఖైదీని దాటేసిన కాటమరాయుడు.. ఇప్పుడు సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి టీజర్ రికార్డును కూడా కుమ్మేయడం విశేషం.

కబాలి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్ ను అందుకునేందుకు 8 గంటల సమయం పట్టగా.. కాటమరాయుడు మాత్ర కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించేశాడు. సౌతిండియా సూపర్ స్టార్ రికార్డును.. టాలీవుడ్ లో మాత్రమే క్రేజ్ ఉన్న పవర్ స్టార్ కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. మరోవైపు.. ఇప్పటికే 1.38 లక్షల లైక్స్ తో.. తిరుగులేని బెంచ్ మార్క్ సెట్ చేశాడు పవర్ స్టార్ కాటమరాయుడు.