హీరోయిన్స్ తో పవన్ అసభ్య ప్రవర్తన?

0pawankalyan-nikhishaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో. హ్యాపీగా మూవీలు చేసుకుంటూ, మూవీకు 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ, లైఫ్ ను ఎంజాయ్ చేయకుండా, అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ విధమైన భావనతో కలిగిన మాటలను పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రారంభ సభలో స్వయంగా తను చెప్పినవే. అయితే ఓ సాధారణ మనిషిలా ఆలోచించిన పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి మంచి పనే చేశాడని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటి వరకూ ఎంతో మంది లీడర్స్ ను ఆదరించిన ప్రజలు, ప్రస్తుత రాజకీయాలపై విసిగెత్తి ఉన్నారు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ ద్వార నిజాయితీ గల రాజకీయాలకు తెరలేపడమే కాకుండా, ప్రజలకు నమ్మదగిన పరిపాలన ఇస్తాడని అందరూ ఊహించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రారంభం కాబోతున్న రాజకీయపార్టీల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నదానిపై ఓ ప్రధాన పార్టీ అన్ని విధాల సమాచారాన్ని సేకరిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో హీరోయిన్స్ ను వేధించేవాడని, హీరోయిన్స్ పై మంచి ఫీలింగ్ ఉండేది కాదని ఇండస్ట్రీలోని ఓ వర్గం వద్ద నుండి సమాచారాన్ని సేకరించింది ఆ పొలిటికల్ పార్టీ.

అయితే పవన్ కళ్యాణ్ కొన్ని మూవీల సమయంలోనే ఈ విధంగా చేశాడని, తరువాత హీరోయిన్స్ కు దూరంగా ఉన్నాడని కూడ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ వర్గం ఆ రాజకీయ పార్టీకు చెప్పింది. అయితే పవన్ ఏ హీరోయిన్ ను విసిగించి ఉంటాడు అంటూ ప్రస్తుతం కూపీ లాగుతుంది ఆ పార్టీ. మొత్తంగా చెప్పాలంటే పవన్ వ్యక్తిగత జీవితాన్ని ఓ ప్రధాన పార్టీ బహిర్గతం చేయటానికి సిద్ధంగా ఉందనే చెప్పాలి. రాజకీయ పార్టీ చేస్తున్న ఈ అసహ్యపు రాజకీయాన్ని పవన్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలని టాలీవుడ్ అంటుంది. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయాలనుకున్న రాజకీయ పార్టీ ఏదై ఉంటుంది? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను తెలియపరచండి.

Source: APH