పవన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు..

0పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినీ అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతాడు. సినిమాల పరంగా కంటే తన గొప్ప మనసును ఇష్టపడతారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేయడమే కాదు ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన దేవుడు ఆయన..అలాంటి ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకుని వార్తల్లో నిలిచారు.

తాజాగా ఆయన దివ్యాంగుల టీ ట్వంటీ క్రికెట్‌కు 5 లక్షలు ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. వాళ్లు పడుతున్న కష్టాన్ని విని చలించిపోయిన పవన్ కల్యాణ్ 5 లక్షల సాయాన్ని ఆ దివ్యాంగుల క్రికెటర్లకు అందజేశారు. “వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డంకి కాదు, దీన్ని వీరు నిరూపిస్తున్నా. ఆత్మస్ధైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ వీళ్ళు స్ఫూర్తిగా నిలుస్తున్నారు,” అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు.