పవన్ కల్యాణ్ లో కలవరం…

0జనసేన అధ్యక్షుడు – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలవరపడుతున్నారా? పార్టీలోఅంతర్గతంగా జరిగిన ఓ సర్వే పవన్ కల్యాణ్ కు చికాకు తెప్పిస్తోందా.? అవుననే అంటున్నాయ్ పార్టీ వర్గాలు. జల్లాల పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించారట. తాను పర్యటించిన జిల్లాలలో పార్టీ పరిస్దితి ఎలా ఉందో సర్వే నిర్వహించారట. ఈ సర్వేను నాలుగు విభాగాలుగా నిర్వహించినట్లు తెలిసింది. పద్దెనిమిది నుంచి ముప్పయ్ ఏళ్ళ వయస్సున్నవారు ఒక వర్గంగాను – ముప్పయ్ నుంచి నలభై ఐదు మధ్య వయస్సున్న వారు ఒక క్యాటగిరి గానూ… ఆపై వయస్సు వారందరూ మరో క్యాటగరిగా విభజించి సర్వే చేసారని తెలిసింది. అలాగే పట్టణ ఓటర్లు – గ్రామీణ ఓటర్లుగా విభజించి సర్వే చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

అంతర్గతంగా నిర్వహించిన ఈ సర్వేలో 18నుంచి 30 ఏళ్ళ వయసున్న వారిలో 60 శాతం మంది పవన్ ఆలోచనలకు అనుకూలంగా వున్నా కానీ అయన రాజకీయ విధానాలపై మాత్రం అనుమాన పడుతున్నారట. సినిమా పరంగానే కాకుండా సమాజానికి ఏదో చేయాలనే తపన పవన్ కల్యాణ్ లో ఉందని వారు అభిప్రాయపడ్డారట. 30 నుంచి 45 వయస్సున్న వారితో జరిపిన సర్వేలో కేవలం 30 శాతం మంది మాత్రమే పవస్ కల్యాణ్ కు అనుకూలంగా మాట్లాడారట. పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించిన వారిలో ఎక్కువమంది ఆయనపై అనుమానాలే వ్యక్తం చేసారట. పవన్ కూడా ఆయన అన్న చిరంజీవి లాగే చేస్తారని అనుమానం వ్యక్తం చేసారట. ఇక 45 ఆపై బడిన వారంతా కేవలం 10 శాతం మంది మాత్రమే పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ఇచ్చినట్లు తెలుస్తోంది మిగిలిన వారంతా సినిమా నటులను నమ్మే పరిస్దితి లేదని తేల్చిపారేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎన్నికలకు చాలా దూరం ఉండడం – ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జనసేన పటిష్టానికి ఉపకరిస్తాయని పార్టీ వర్గాల నమ్మకం. ఎన్నికల లోపు అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునేలా చర్యలు చేపడితే మేలు జరుగుతుందని జనసైనికులు విశ్వసిస్తున్నారు. యువతరం తమకు అనుకూలంగా ఉన్నట్టు సర్వే చెబుతుండడంతో ఇక ద్రష్టంతా మధ్య వయస్కులు – పెద్దలపైనే కేంద్రీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం.