ప్రభుత్వాలు చేయలేని పనులను సత్యసాయిబాబా చేసారు

0pawan-kalyan-in-sathya-sai-పుట్టపర్తి: సత్యసాయిబాబా చూపిన బాటలోనే జనసేన పయనిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. సోమవారం ఉదయం ఆయన పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి నిర్వహణ తీరును పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను సత్యసాయిబాబా చేసి చూపించారన్నారు. సత్యసాయి స్ఫూర్తితోనే జనసేన సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా, రాష్ట్రం, దేశానికే పరిమితం కాకుండా సత్యసాయి సేవాసంస్థలు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. రామకృష్ణ పరమహంస, సత్యసాయిబాబా ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహనీయులని కొనియాడారు. సత్యసాయిబాబా పేరుతో ఓ జిల్లాను ఏర్పాటు చేయాలనేది జనసేన పార్టీ అభిలాషని పవన్‌ పేర్కొన్నారు.