‘అత్తారింటికి దారేది’ విడుదల డైలమాలో పవన్!

0

AD-movie-reviewప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. తన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 7న రిలీజ్ చేద్దామా, వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో త‌న సినిమాని విడుద‌ల చేయ‌డం శ్రేయ‌స్కరం కాదేమో అని స‌న్నిహితుల‌తో చ‌ర్చలు సాగిస్తున్నాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రక‌ట‌న నేప‌థ్యంలో సీమాంధ్రలో బంద్‌లు, ఉద్యమాలు చేస్తున్నారు. జ‌నం తీవ్రంగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. కేంద్రమంత్రి చిరంజీవి కుటుంబీకుల సినిమాల‌ను సీమాంధ్రలో ఆడనివ్వబోమంటూ ప్రజాసంఘాలు చెబుతున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో సినిమా విడుద‌ల చేస్తే భారీ న‌ష్టాలు త‌ప్పవ‌ని నిర్మాత‌, క‌థానాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. అందుకే కొన్ని రోజులు సినిమాని వాయిదా వేసుకోవడం మంచిదని భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యంపై ఈ రోజు ఓ నిర్ణయం తీసుకొనే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. సమైఖ్యాంద్ర ఉద్యమ వేడి చ‌ల్లారాకే సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్ణయం తీసుకొంటున్నట్టు సమాచారం.

‘అత్తారింటికి దారేది’ విడుదల డైలమాలో పవన్!, pawan kalyan in tension, pawan kalyan attarintiki daredi in trouble,