దెబ్బలు తినడం తెలుసు, దెబ్బలు కొట్టడం తెలుసు: అమెరికాలో పవన్ కల్యాణ్

0Pawan-Kalyan-suggestionsతనకు దెబ్బలు తినడం తెలుసు, దెబ్బలు కొట్టడం తెలుసునని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. న్యూహాంఫ్‌షైర్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్యాయం ఎక్కడున్నా తాను సహించనని అన్నారు. తనకు అధికారం అంతిమ లక్ష్యం కాదని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించినప్పుడు తనకు నిజమైన సంతృప్తి లభించిందని చెప్పారు. దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి మనమేమిచ్చామని ఆలోచించాలని అన్నారు. సినిమాల కన్నా ఎక్కువగా ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడు సంతృప్తి లభించిందని అన్నారు.

జనసేన అంతిమ లక్ష్యం ప్రజా శ్రేయస్సు అని చెప్పారు. తనకు కుల రాజకీయాలు నచ్చవని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదని అన్నారు. ప్రసంగం మధ్యలో ఆయన గబ్బర్ సింగ్ టవల్ వేసుకున్నారు. ఇది గబ్బర్ సింగ్ సింబల్ కాదని, సామాన్యుడి సింబల్ అని అన్నారు. భారతదేశంలో దీనికి కులం, మతం లేదని అన్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది భయపెట్టారని, చంపేస్తారని బెదిరించారని చెబుతూ భయపడితే ఇంతా దాకా వస్తామా అని అడిగారు. తనకు జాగ్రత్త ఉంది గానీ భయం లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఎదుర్కుంటానని అన్నారు. రోజూ చావడం కన్నా ఒక్క రోజు చావడం మంచిదని అన్నారు.

జానీ సినిమా సక్సెస్ అయి ఉంటే సినిమాలు వదిలేసేవాడినేమో అన్నారు. సినిమాల్లో సంతోషం ఉందని అన్నారు. సినిమాల ద్వారా ఇమేజ్ వస్తుందని అన్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్‌ను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వాడుకుంటానని చెప్పారు. అందుకే సినిమాలు చేస్తానని చెప్పారు.

బాధ్యతలు ఎక్కువైనప్పుడు సినిమాలకు దూరంగా ఉంటామనేమో గానీ వదిలేయనని అన్నారు. సినిమాల ద్వారా ఇమేజ్, డబ్బూ వస్తుందని చెప్పారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు చెప్పబోనని అన్నారు. మీలో నుంచి నాకు బలమైన నాయకత్వం కావాలని అన్నారు.

రాజకీయాల పిల్లలు తప్ప మిగతా వాళ్లు వాళ్లకు యూత్ కాదని అన్నారు. పార్టీని విస్తరించాలని ఉందని, మీలాంటి కోసం చూస్తున్నానని అన్నారు.