ఆంధ్రజ్యోతి కార్యాలయానికి కేసీఆర్, పవన్

0Pawan-kalyan-kcr-visits-andhrajyothi-officeఅగ్ని ప్రమాదానికి గురైన ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సందర్శించారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో నేతలు వరుస కడుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్యాలయాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కూడా కార్యాలయానికి వచ్చారు.

అగ్ని ప్రమాదానికి గురైన ఆఫీసును పరిశీలించిన పవన్ కళ్యాణ్.. సిబ్బంది నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ కూడా ప్రమాదం జరిగిన కార్యాలయాన్ని సందర్శించారు. ఘటనా వివరాలను కార్యాలయ పబ్లిషర్ కోగంటి శేషగిరి రావును అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్యాలయ పనులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరో ఏర్పాటు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి