కూతురి పుట్టిన రోజుకి పవన్ కళ్యాణ్

0Pawan-kalyan-on-her-daughter-birthdayసినిమా రాజకీయాలతో ఎప్పుడు బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అందుకే కాటమరాయుడు సినిమా రిలీజ్ బిజీలో ఉండి కూడా కూతురు ఆద్య బర్త్డే సందర్భంగా ఆమెతో సమయం గడిపి వచ్చాడు. గురువారం ఆద్య పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్తో కలిసి కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు.

ఆద్య స్కూల్ ఓ జరిగిన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్ చిన్నారులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వెల్లడించిన రేణు, ‘ పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే నిజమైన బహుమతి. వారి పుట్టిన రోజున కాస్త సమయమే’ అంటూ ట్వీట్ చేసింది. రేణుతో విడాకులు తీసుకున్న తరువాత కూడా పవన్ పిల్లల కోసం రెగ్యులర్ గా వారిని కలుస్తూ, వారి బాగోగులు చూసుకుంటున్నాడు.