కథ తెచ్చుకోమన్న పవన్ కళ్యాణ్

0Pawan-Promises-Dil-Rajuతొలిప్రేమ సినిమా నుండి ఇప్పటివరకు.. పవర్ స్టార్ సినిమా అంటే చాలు.. అక్కడికి వెళ్ళిపోయి కొనేస్తాడు నిర్మాత దిల్ రాజు. ఆ విధంగా హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ మీద తన అభిమానం చాటుకుంటూ ఉంటాడు. అయితే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా నిర్మించి తీరాలనేదే రాజు గారి కల. ఇంతకీ ఆ కల ఎప్పుడు తీరుతుంది?

ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడంటూ స్ర్టాంగ్ గా వినిపిస్తోంది. 2019లో ఆయన జనసేనను ఎన్నికల బరిలోకి దింపే ఉద్దేశ్యంతో ఉన్నాడు కాబట్టి.. త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వగానే మరో సినిమా చేసేసి ఫుల్ స్టాప్ పెడతాడు అనే రూమర్ ఉంది. అందుకే ఇప్పుడు కంగారుపడిన దిల్ రాజు.. మొన్న తివిక్రిమ్ సినిమా షూటింగ్ స్పాటులో పవన్ కళ్యాణ్ ను కలిశాడట. సార్ మనం ఒక సినిమా అనుకున్నాం కదా అంటే.. ‘మిమ్మల్ని కథ తెచ్చుకోమని చెప్పాను. జస్ట్ మీరు కథ ఓకె చేయించుకోండి నాతో.. నేను సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. మీ బ్యానర్లో చేయడానికి నాకేం ప్రాబ్లం ఉంటుంది.. నాకు కథ కావాలంతే’ అని చెప్పాడట పవన్. దానితో మరోసారి కథల వేటలో బిజీగా ఉన్నాడు దిల్ రాజు.

నిజానికి మెగా క్యాంపులో దాదాపు అందరి హీరోలతోనూ దిల్ రాజుకు సత్సంబంధాలున్నాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ప్రొడక్షన్లో సినిమా ఒకటి చేస్తానని ఎప్పుడో చెప్పారు. ఇక మిగిలిన స్టార్లందరూ దాదాపు చేసేశారు. ఇప్పుడు పవన్ ఒక్కడు చేస్తే.. దిల్ రాజును ”మెగా” ప్రొడ్యూసర్ అని పర్మినెంట్ గా పిలవొచ్చు. అంతేనా రాజు గారూ?